గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశంలో చేరిక

గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం చేరిక
(యువతరం నవంబర్ 19) పాణ్యం విలేఖరి:
పాణ్యం మండల టౌన్ బస్టాండ్ పరిధిలో వినాయకుని గుడిలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అయ్యప్ప రెడ్డి కాలని, బిసి కాలనిల్లో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ మరియు ప్రజా వేదిక కార్యక్రమాలు టీడీపీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ గౌరు చరిత రెడ్డి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగు దేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి కందికాయల పల్లె గ్రామానికి చెందిన పలువురు పాణ్యం టౌన్ నుండి 50 మంది గౌరు చరిత రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.