కుప్పం నారా అడ్డా, పులివెందుల వైయస్ అడ్డా, డోన్ కేఈ అడ్డా
డోన్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్

మా కుటుంబానికి ఓనమాలు నేర్పిన డోన్ నియోజకవర్గం
డోన్ నియోజకవర్గంను
కేఈ కుటుంబం వదిలే సమస్య లేదు
మాజీ మంత్రి కేఈ ప్రభాకర్
(యువతరం నవంబర్ 24 )
డోన్ ప్రతినిధి:
మాజీమంత్రి కేఈ ప్రభాకర్ జన్మదిన సందర్భంగా గురువారం డోన్ పట్టణంలోని అమ్మ హోటల్ నుంచి టౌన్ మీద భారీ ఊరేగింపుతో బాలసంచాలు కాల్చి హర్ష వ్యక్తం చేశారు.
టౌన్ లో మధు ఫంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు.
ఆ తర్వాత మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ.
డోన్ నియోజకవర్గం లో కేఈ కుటుంబానికి ఓనమాలు నేర్పిన నియోజకవర్గం అంతే తప్ప డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబం వదిలే సమస్య లేదు అన్నారు.
జగన్ పులివెందుల వదలడు, చంద్రబాబు నాయుడుకు కుప్పం వదలడు,
కేఈ కుటుంబం డోను వదలే ప్రసక్తే లేదన్నారు.
వార్డ్ నెంబర్ గాని, సర్పంచ్ గాని, కౌన్సిలర్ గా, ఎంపిటిసి గాని, గెలవలేని వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించడం అతి ఆశ అని అన్నారు. అదేవిధంగా ఈ మధ్యనే సుబ్బారెడ్డి పై 4 సార్లు సర్వే చేస్తే సర్వేల లో గెలవలేడని తేలింది. అదేవిధంగా అధిష్టానం 4 వ సారీ
సర్వే చేయించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
అదేవిధంగా రెండు సార్లు గెలిచిన ఆర్థిక శాఖ మంత్రి ఎదుర్కోవాలంటే సింహం లాంటి వ్యక్తి కావాలని అన్నారు. అదేవిధంగా డోన్ టిడిపి నియోజకవర్గం ఇన్చార్జి ఏ మాత్రం ఎమ్మెల్యే టికెట్ కు అర్హుడు కాదని అధిష్టానం మరోసారి పునర ఆలోచన చేయాలని కేఈ ప్రభాకర్ కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే టిడిపి ఇన్చార్జి టిడిపి వాళ్ళని ఎంతమందిని వేధించాడో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
అదేవిధంగా పక్క నియోజవర్గం నుంచి ఒకరు
డోన్ నియోజకవర్గం నికి ఎంతైనా నేను ఖర్చు పెడతానని అనడం ఎంతవరకు సమజస్యమని నేను టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో కాంట్రాక్ట్ పనులు చేసి ఉంటే నేను 4 నియోజకవర్గాలకు ఖర్చు పెట్టే వాళ్ళం మేము డబ్బుకు ఏనాడు కే ఈ కుటుంబం ఆలోచించలేదు
అదేవిధంగా డోన్ లో పోటీ చేయడానికి కె ఈ కుటుంబం లో చాలామంది ఉన్నారు. గత 40 ఏళ్ల నుంచి మేము రాజకీయంలో ఉన్నాం ఎవరికైనా ఓటమి గెలుపు అనేది సర్వసాధారణమే అంత మాత్రాన మమ్మల్ని దూరం చేయడం మంచిది కాదని.
మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆదిష్టాన్ని హెచ్చరించారు.