ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీ గిరి క్షేత్రం నందు నేడు కార్తీక మాసం సందర్భంగా జ్వాలాతోరణం

శ్రీగిరి క్షేత్రం నందు నేడు కార్తీక మాసం సందర్భంగా జ్వాలాతోరణం

(యువతరం నవంబర్ 26) శ్రీశైలం ప్రతినిధి:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు కార్తీక మాసం సందర్భంగా నేడు జ్వాలా తోరణాన్ని ప్రారంభిస్తారు. ఈ జ్వాలతోరణాన్ని ఆలయ ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద నిర్వహిస్తారు. ఈ కార్తీక జ్వాలతోరణం సర్వ మానవ పాపహరణ. ఈ జ్వాల తోరణం లో అనేకమంది భక్తులు పాల్గొంటారు .ఈ జ్వాలతోరణాన్ని ప్రదోషకాల వేళలో వెలిగిస్తారు. అనేకమంది భక్తులు వెలుగుతున్నటువంటి జ్వాలాతోరణం క్రింద అటు ఇటు పరిగెత్తుతారు. ఈ విధంగా చేయడం వలన మనుషుల యొక్క పాపాలను అగ్నిజ్వాలలు హరిస్తున్నట్టు భక్తుల గాఢవిశ్వాసం. ఈ కార్తీక మాసం లో దానాలు ,నది స్థానాలు ,ఉపవాసాలు ముఖ్యమైనవి. కార్తీక మాసంలో వ్రతాలు, నోములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం నెలరోజుల పాటు ఉంటుంది. కార్తీకమాసానికి సమానమైన మాసం లేదు. వేదంతో సమానమైన శాస్త్రము లేదు. సనాతన హిందూ సాంప్రదాయంలో ఈ కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఈ కార్తీకమాసం.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!