తెనాలి తో హీరో కృష్ణకు ఉన్న అనుబంధం మరచిపోలేరు…..

తెనాలితో కృష్ణకు అనుబంథం మర్చి పోలేరు
(యువతరం నవంబర్ 15) తెనాలి ప్రతినిధి:
తెనాలి ప్రాంత ప్రజలతో హీరో కృష్ణతో ఉన్న అనబంథంమరవలేనిదని కృష్ణ అభిమానులు అన్నారు. కృష్ణ ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని స్థానిక చినరావూరు పార్కు వద్ద మైక్ మురళి, సూపర్ స్టార్ కృష్ణ ఫాన్స్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరిస వెంకటేశ్వరరావు తాడిబోయిన కృష్ణ మానవహక్కులసంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు, రాము, తిరుపతి రావు పోత్తూరు రాఘవ భాషా లక్ష్మీనారాయణ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్ మురళి గ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ బుర్రిపాలానికి తెనాలికి అలాగే సినీ ఇండస్ట్రీకి వెలకట్టలేని గౌరవ మర్యాదలు విలువను తీసుకొచ్చారని అలాగే ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ నటుడిగా ఇండియాలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొంది నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మన మధ్యన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు,
ఫోటో:- తెనాలి చిన్నరావూరు పార్క్ వద్ద అన్నదానం నిర్వహిస్తున్న కృష్ణ అభిమానులు