ANDHRA PRADESHCRIME NEWS
విద్యుత్ ఘాతంతో కౌలు రైతు మృతి

విద్యుత్ ఘాతంతో కౌలు రైతు మృతి
యువతరం నవంబర్ 15 తెనాలి ప్రతినిధి:
తెనాలి మండలం కటెవరం లో కరెంట్ షాకు తగిలి ఓ కౌలురైతు మృతి సంఘటన జరిగిందింది. బొల్లెద్దు గోపయ్య (52)తన కౌలు పొలంలో గడ్డి కోసుకొని నిమిత్తం వెళ్లి గట్టుపై ఉన్న కరెంటు వైర్ ని చూసుకోక కొడవలితో కోయగా తగిలిన కరెంటు షాక్ వలన మరణించడం జరిగింది.
మృతుని కుటుంబీకులు ఎంతసేపటికి తిరిగి రాకపోవటం చే దీనిపై వారు పొలం వెళ్లి పరిశీలించగా మృతుడు పొలంలో అచేతనంగా పడిపోయి మరణించి ఉండటం గమనించినారు.దీనిపై తాలూక గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం చేస్తున్నారు.