ANDHRA PRADESHCRIME NEWS

గుంటూరులో మహిళపై అమానుషం…..?????

గుంటూరులో మహిళపై అమానుషం

(యువతరం నవంబర్ 15) గుంటూరు ప్రతినిధి:

”మహిళలపై మగాడి జులుం మాత్రం కొనసాగుతూనే వుంది.గుంటూరు మిర్చీ యార్డు సెక్యూరిటీ సిబ్బంది ఓ మహిళతో దారుణంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఏ తప్పు చేసిందో తెలీదుగానీ సెక్యూరిటీ సిబ్బంది అందరిముందే అమానుషంగా వ్యవహరించారు. పట్టుకుని కులం పేరుతో దూషిస్తూ రోడ్డుపైనే లాఠీతో చితకబాదారు. ఆమె ఎంత వేడుకున్నా కనికరం చూపించకుండా దాడికి పాల్పడ్డారు.
దాడితో ఆగకుండా మహిళ వస్త్రాలు పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లారు సెక్యూరిటీ సిబ్బంది. ఇలా పక్కకు తీసుకెళ్లి ఆమె చెంపలపై, ఒంటిపై ఎక్కడపడితే అక్కడ కొట్టారు. ఇలా ఆ మహిళతో చాలా దారుణంగా ప్రవర్తించారు గుంటూరు మిర్చీయార్డ్ సెక్యూరిటీ సిబ్బంది.

మిర్చీ యార్డులో ఓ షాప్ విషయంలో గొడవే మహిళపై దాడికి కారణమని తెలుస్తోంది. బాధితురాలిది ఎస్టీ సామాజికవర్గంగా తెలుస్తోంది. ఏదేమైనా సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్ చేస్తూ అణగారిని వర్గాలకు చెందిన మహిళతో దురుసుగా ప్రవర్తించడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. మహిళపై సెక్యూరిటీ గార్డులు దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది… దీంతో నెటిజన్లు సదరు సెక్యూరిటీ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!