ANDHRA PRADESHOFFICIAL
గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన
(యువతరం నవంబర్ 15) వెల్దుర్తి విలేఖరి:
గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం వెల్దుర్తి గ్రంధాలయంలో గ్రంధాలయ అధికారిణి కవిత బాయి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనేకమంది మేధావులైన రచయితలు రచించిన పుస్తకాలు విద్యార్థిని విద్యార్థులు సందర్శించి చక్కగా చదువుకున్నారు. ఈ సందర్భంగా గ్రంధాలయ అధికారిణి కవిత బాయి మాట్లాడుతూ వెల్దుర్తి గ్రంధాలయంలో ఎన్నో మంచి పుస్తకాలు వున్నాయని ప్రపంచంలో అత్యున్నత విజయం సాధించినఎందరో మేధావులు పుస్తక ప్రియులేనని విద్యార్థిని విద్యార్థులు గ్రంధాలయంలో సభ్యులుగా చేరి పుస్తకపఠనం అలవాటు చేసుకోని అద్భుతమైన విజయాలు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి కవితా భాయి, ఉపాధ్యాయుడు రఘు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.