జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపటమే ధ్యేయం

జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపటమే ధ్యేయం
టిడిపి -జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు జనసేన నియోజవర్గం ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్
(యువతరం నవంబర్ 16) మార్కాపురం ప్రతినిధి:మా
మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ లో టిడిపి- జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో ఇద్దరం కలిసి పోరాటం చేద్దామని రెండు పార్టీలు పోరాటం చేసి అవినీతి అరాచకం తో గద్దనెల్లుతున్న వైసిపి పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
వారు మాట్లాడుతూ ఉమ్మడి డిక్లరేషన్ ప్రకటించారు. ప్రాధాన్యతగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం వచ్చినప్పుడు ప్రకటించినటువంటి హామీలైన మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని , వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని , పొదిలి మండలంలను వెలిగొండ ఆయకట్టు పరిధిలోకి తేవాలని సంయుక్త సమావేశంలో ప్రకటించారు. మార్కాపురం నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయాయి అని వాటిపై ఉమ్మడి గా పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం మరియు జనసేన సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.