సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు లబ్ధి: కేఈ శ్యాం కుమార్

సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు లబ్ధి
పత్తికొండ తెదేపా నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాం కుమార్
(యువతరం నవంబర్ 16) వెల్దుర్తి విలేఖరి:
వెల్దుర్తి మండలం లోని అల్లు గుండు, బొమ్మిరెడ్డి పల్లె,మల్లెపల్లే గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కే.యి. శ్యామ్ కుమార్ బుధవారం నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ ఏ పథకాలు ద్వారా లబ్ధి పొందుతారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించిన భవిష్యత్ గ్యారెంటీ మినీ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి కుటుంబానికి ఏ ఏ పథకాలు వస్తాయో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక ఉన్న సమస్యలను పరిష్కరించలేక, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారని జగన్‌మోహన్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు ప్రజలు త్వరలోనే ఓటు ద్వారా బుద్ది చెబుతారన్నారు. అనంతరం గ్రామ ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జులు అలాగే గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.