వైసీపీ దోపిడీ పాలనకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి

వైసీపీ దోపిడీ పాలనకు ఓటు ద్వారా బుద్ది చెప్పాలి : గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల
(యువతరం నవంబర్ 16) గిద్దలూరు ప్రతినిధి:
రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలను దోచుకోవటమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని 11వ వార్డులో పర్యటించిన అశోక్ రెడ్డి గారు వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిత్యావసర ధరలను, ఇసుక, సిమెంట్, బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలను పెంచి దోపిడీ పాలన కొనసాగిస్తూ తన ఖజానా నింపుకుంటున్నాడని, జగన్ అరాచక పాలనలో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా సైకిల్ గుర్తు పై తమ ఓటు వేసి, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి స్థానిక టీడీపీ నాయకులు ఎలిశెట్టి వెంకటప్ప, మోడీగారి కృష్ణ, సాగనబోయిన రమేష్, పూల పద్మనాభం, నల్లగట్ల బ్రహ్మం, కొప్పు కార్తీక్, మరియు పట్టణ కౌన్సిలర్లు బిల్లా రమేష్ యాదవ్, పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు పానుగంటి ఇజ్రాయేలు, కాపు నాయకులు దుత్తా బాలీశ్వరయ్య, ఉలాపు బాలచెన్నయ్య, మాజీ కౌన్సిలర్ మండ్ల శ్రీను, మైనార్టీ నాయకులు షేక్ జాఫర్, షేక్ పెద్ద మస్తాన్, బద్రి బాషా, పార్లమెంట్ నాయకులు గోపారపు గోపాల్ రెడ్డి, తెలుగుయువత ప్రధాన కార్యదర్శి బోయిలపల్లి కిషోర్, కార్యదర్శి సుండీ వెంకట రమణ, ఉపాధ్యక్షులు గిద్దలూరు మద్దిలేటి, వేములపాటి చంటి, పిడతల రవితేజ, అశోక్ నాయక్, షేక్ నాయబ్, రాబర్ట్, మండ్ల రంగనాయకులు, వినుకొండ చిన్న, బత్తుల శ్రీను, మరియు క్లస్టర్ ఇంచార్జ్ గర్రె సాయినాధ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గోన్నారు.