తెనాలిలో పిండి వంటలు కావాలా, శశి బేకరీ సందర్శించండి

పిండివంటలకు సమయం,తీరిక లేకపోతే శశి బేకరి
(యువతరం నవంబర్ 12) తెనాలి ప్రతినిధి:
దసరా, దీపావళి పండుగ రోజున నోరూరించే పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. గారెలు, అరిసెలు, మడుగులు, కారప్పూసలు, సకినాలు, లడ్డూలు, కారా, జిలేబీ, బూందీ, చెగోడీలు, కరిజలు వంటి నోరూరించే పిండి వంటలు చేసుకుంటారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు వాటిని చేసుకునేంత ఓపిక, తీరిక ఉండడం లేదు. దీంతో తెనాలి & పరిసర ప్రాంతాల ప్రజలు చాలా మంది పిండి వంటలు అనగానే పట్టణంలోని వివిథకూడళ్ళలో వెలసిన “శశి ” కి పరుగులు తీస్తున్నారు. ఇందు లో అందరికీ ఇష్టమైన ఖాజాలు, బొబ్బట్లు సున్నుండలు, పూతరేకులు, రకరకాల మిఠాయిలు శుభకార్యాలకు పుట్టిన/పెళ్ళి రోజులకు ప్రత్యేక కెకులు కూడా లభిస్తున్నాయి. వీటితో పాటు రోజూ తినేటువంటి పచ్చళ్లు, పొడులు కూడా లభిస్తున్నాయి.
ఇంట్లో చేసేటువంటి రుచి, శుచి ఉండటంతో చాలా మంది శశి ఫుడ్స్ లో కొనుగోలు చేస్తున్నారు. పూర్వకాలంలో పిండివంటలను చేసేందుకు చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు అందరూ కలిసి చేసుకునేవాళ్లు.కానీ ఇప్పుడా రోజులు లేవు. ఎవరి ఇంట్లో వారే చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో చేసే ఓపిక లేకపోవడంతో శశి ని ఆశ్రయిస్తున్నారు,
పండుగ రోజుల్లో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుంటాయని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం కొనుగోలు చేసేవారి అభిరుచికి అనుగుణంగా పిండి వంటలు కేకులను చేయడమే అని నిర్వాహకులు వుప్పల వరదరాజులు పేర్కొన్నారు.
నాణ్యమైన రుచికరమైన వంటకాలు తక్కవ ధరల్లో లభిస్తుండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వంటకాల్లో కూడా నాణ్యమైన నూనెను వినియోగిస్తుంటామని ఎక్కువ మోతాదులో కావాల్సి వచ్చినప్పుడు ఆర్డర్ ప్రకారం వారు చెప్పిన విధంగా వంటకాలు సిద్దం చేస్తామని నిర్వాహకులు వరదరాజులు అన్నారు.