అనుమతులు ఉన్న షాపు నుండి బాణాసంచా కొనాలి

అనుమతులు ఉన్న షాపునుండే బాణసంచా కొనండి
(యువతరం నవంబర్ 12) తెనాలి ప్రతినిధి:
దీపావళి బాణసంచా విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలని
నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని తాలూక SI Ch.వేంకటేశ్వర్లు తెలిపారు.
విక్రయించే దుకాణాలకు నియమ నిబంధనలు
బాణాసంచా నిల్వచేసే గూడెం నిర్వాహకులు, తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలన్నారు.
బాణసంచా సామాగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు నివాస ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఉండాలన్నారు.
ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.
వాటిలో విధులు నిర్వహించే వారికి అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
బాణాసంచా విక్రయ దుకాణాలు అధికారులు సూచించిన ప్రదేశంలోనే ఏర్పాటు చేసుకోవాలన్నారు.
జనావాసాలకు, విద్యాసంస్థలకు, హాస్పిటల్స్ కు దూరంగా బాణాసంచా విక్రయాలు జరగాలన్నారు.
బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య నిర్దిష్ట దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రతీ దుకాణం వద్ద రెండు అగ్ని నిరోధక సిలెండర్లు, రెండు బకెట్ల పొడి ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
.