తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని

తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని…..
సిపిఎం, సిపిఐ, టిడిపి, కాంగ్రెస్ జనసేన ఆధ్వర్యంలో…
గుత్తి పత్తికొండ రహదారి దిగ్బంధం..
ఎడ్లబండ్లతో నిరసన తెలుపుతున్న రైతులు..
నిలిచిపోయిన వాహనాలు..
(యువతరం నవంబర్ 2) తుగ్గలి విలేకరి..
కర్నూలు జిల్లా తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ గురువారము మండల కేంద్రమైన తుగ్గలిలో గుత్తి పత్తికొండ ప్రధాన రహదారిలో సిపిఎం, సిపిఐ,టిడిపి, కాంగ్రెస్, జనసేన ఆధ్వర్యంలో గురువారం రోడ్డును దిగ్భంధం చేశారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఎడ్ల బండ్ల ద్వారా నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్, టిడిపి అధికార ప్రతినిధి మనోహర చౌదరి, సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు,టిడిపి మండల కమిటీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు,సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్, కాంగ్రెస్ నాయకులు నాగార్జున మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన తుగ్గలి మండలాన్ని ప్రభుత్వము కరువు మండలం గా ప్రకటించకపోవడం విచారకరమన్నారు. నిత్యము కరువు కోరల్లో చిక్కు కొనిన తుగ్గలి మండలాన్ని అధికారులు ఎందుకు కరువు మండలం గా ప్రకటించలేదో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. పత్తికొండ శాసనసభ్యులు శ్రీదేవి తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించకపోవడం ఆమె నిర్లక్ష్య ధోరణికి కారణమన్నారు. సక్రమంగా వర్షాలు పడక పంటలు పండక పోవడంతో రైతులు వ్యవసాయ కూలీల సైతం సుదూర ప్రాంతాలకు వలసలు వెళుతుంటే ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. వర్షపాతం కూడా తక్కువ నమోదైనప్పటికీ అధికారులు నిర్లక్ష్య ధోరణితో తుగ్గలి కరువు మండలంగా నోచుకోలేదన్నారు. వర్షాలు పడకపోవడంతో వేసిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు. తుగ్గలిని కరువు మండలముగా పట్టించేంతవరకు తమ ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తుగ్గలి మండలాన్ని తక్షణమే కరువు మండలం గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు కొండారెడ్డి,గురుదాసు, ఉమాపతి, రంగరాజు, సిఐటియు నాయకులు ప్రతాప్, టీడీపీ నాయకులు వల్లే వెంకటేష్, కిష్టయ్య, త్రిమూర్తులు, రవి,వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, రైతులు పాల్గొన్నారు.