అంటూ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన

అంటు వ్యాధులపై విద్యార్థులకు అవగాహన……..
(యువతరం నవంబర్ 2 )తుగ్గలి విలేకరి…
మండల కేంద్రమైన తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు అంటు వ్యాధులపై వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పోగాకు వల్ల నష్టాలను వారు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సిహెచ్ఓ అన్నపూర్ణ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రంగా ఉంటే అంటూ వ్యాధులు దరికి రావు అన్నారు. అందుకు ప్రతి విద్యార్థి పరిశుభ్రతను పాటించాలన్నారు. పొగాకు వాడడం వల్ల శరీరంలో ఉన్న ప్రతి అవయవములను నాశనం చేస్తుందన్నారు. దాని వల్ల క్యాన్సర్ తో పాటు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గర్భాశయ ముఖ ద్వారం, ప్లేగు తదితర అవయవాలు పూర్తిగా చెడిపోతాయన్నారు. చాలామంది తెలియక పొగాకును వాడుతున్నారని అటువంటి వారికి తగిన ఆరోగ్య సూత్రాలను సూచించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జయలక్ష్మి, ఉపాధ్యాయులు రామ మోహన్, బాబురావు, శ్రీనివాసులు, ఆరోగ్య కార్యదర్శి మహాలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.