ANDHRA PRADESHPROBLEMS

కరువు మండలాల్లో అన్ని ఫీజులను రద్దు చేయాలి

కరువు మండలాల్లో అన్ని ఫీజులను రద్దు చేయాలి*
కరువు భత్యం కింద విద్యార్థులకు ప్రత్యేకమైన స్కాలర్ షిప్ విడుదల చేయాలి*
విద్యాశాఖ మంత్రి స్పందించాలి*
పి డి ఎస్ ఓ అధ్వర్యంలో విద్యార్థుల నిరసన*

(యువతరం నవంబర్2)
ఎమ్మిగనూరు ప్రతినిధి..

రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా కరువు మండలాలను ప్రకటించిందని అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలు అత్యధికంగా ఉన్నాయని అయితే కరువు మండలాల్లో విద్యార్థుల అన్ని రకాల ఫీజులను తక్షణమే రద్దుపరిచే విధంగా ప్రత్యేకమైనటువంటి జీవోను విడుదల చేయాలని పిడిఎస్ఓ నియోజకవర్గ కన్వీనర్ సురేంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి పిడిఎస్ఓ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరువు తో ప్రజలు రైతులు విద్యార్థులు అల్లాడిపోతున్నారని ఈ కరువు పరిస్థితుల్లో విద్యార్థులు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కాక పరీక్ష ఫీజులు కూడా కట్టించుకోలేనటువంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో విద్యార్థులందరూ ఉన్నారని అయితే రాష్ట్ర ప్రభుత్వం కరువు బత్యం కింద మరి విద్యార్థులందరికీ కూడా పదవ తరగతి నుంచి పీజీ చదివే విద్యార్థులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి స్కాలర్షిప్ ను అదే విధంగా స్కూల్ ఫీజులు పరీక్ష ఫీజులు ఇలాంటి రకాలైనటువంటి అన్ని ఫీజులను కూడా తక్షణమే రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా విద్యార్థుల ఫీజుల రద్దు కొరకు భవిష్యత్తులో ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూకా నాయకులు రవి, ఇమ్రాన్,వీరేంద్ర, తదితరులు పాల్గొన్నారు

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!