AGRICULTUREOFFICIAL

ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి పొరపాట్లు ఉంటే తెలియజేయవచ్చు

ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి పొరపాట్లు ఉంటే తెలియచేయవచ్చు*

*రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్…*

(యువతరం నవంబర్ 2) ఆదోని ప్రతినిధి:

ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి పొరపాట్లు ఉంటే సంబంధిత అధికారులకు తెలియచేయవచ్చని ఆదోని నియేజక వర్గ ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.*.

*గురువారం ఉదయం సబ్ కలెక్టరేట్ సమవేశ మందిరం నందు సబ్ కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.*

*ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 27 వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందన్నారు.. రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి, అందులో ఏమైనా తప్పులు , పొరపాట్లు జరిగి ఉంటే సంబంధిత ఏ ఈ ఆర్ఓ , ఈ ఆర్వో , బి ఎల్ ఓ లేదా ఆదోని ఎన్నికల అధికారి కి సంబంధిత ఫారం లో డిసెంబర్ 9 వ తేదీ లోపు అందజేయాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.. చనిపోయినా లేదా శాశ్వతంగా వేరే ప్రదేశానికి మారినా, వారి ఓట్లు తొలగించడానికి ప్రత్యేక ఫారాలను విడి విడిగా ఇవ్వాలని కోరారు. పై సవరణలన్నీ పూర్తి అయిన తర్వాత ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా వచ్చే జనవరి 5 వ తేదీ న ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని ఆదోని ఎన్నికల అధికారి తెలియజేశారు.*

*స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని… నవంబర్ 4వ మరియు 5వ తారీకు ( శనివారం , ఆదివారం)లలో మరియు డిసెంబర్ నెల 2వ మరియు 3వ తారీకు (శనివారం , ఆదివారం)లలో నిర్వహించడం జరుగుతుందని , కావున రాజకీయ పార్టీలు , ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆదోని ఎన్నికల అధికారి కోరారు. కొత్తగా ఓటర్లు ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సబ్ కలెక్టర్ తెలియజేశారు.*

*పార్టీల ప్రతినిధులు వారు గమనించిన పోలింగ్ స్టేషన్ వారీగా ఉన్న సమస్యలను ఆదోని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని రావలసిందిగా కోరారు.*

*ఈ సమావేశానికి తాసిల్దార్ వెంకటలక్ష్మి, ఉప తాసిల్దారులు రజినీకాంత్ రెడ్డి, ఇజాజ్ అహ్మద్, డి ఎల్ పి ఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప, ఎంపీడీవో కార్యాలకు పరిపాలన అధికారి విజయ శేఖర్,రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.*

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!