బడుగు బలహీనవర్గాల అభ్యున్నతిని అనచి వేయడమే లక్ష్యంగా కొల్లు రవీంద్ర పై తప్పుడు కేసులు

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అనచివేయడమే లక్ష్యంగా కొల్లు రవీంద్ర పై తప్పుడు కేసులు…
దొంగ కేసులతో వేధింపులు మద్యం దోచుకుంటూ చంద్రబాబుపై కేసా?
జీవోలు ఇచ్చిన అజయ్ కల్లాం రెడ్డి ని విచారించరా?
మద్యం దోచుకున్నది ఎవరో పసిపిల్లాడు అడిగినా చెపుతాడు
మధ్య నిషేధం ఏమైంది జగన్ రెడ్డి…
(నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు బేస్తా మల్లికార్జున)
(యువతరం నవంబర్ 2 )
డోన్ ప్రతినిధి:
డోన్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నంద్యాల జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు బేస్తం మల్లికార్జున మాట్లాడుతూ….
రూపాయి అవినీతి నీర్పించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్టు చేశారు. జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతూ ఫైబర్ గ్రిడ్ విన్నర్ రింగ్ రోడ్ అంగళ్లు సంఘటనపై కేసు పెట్టి వేధించేందుకు ప్రయత్నించారు. నిన్నటికి నిన్న చంద్రబాబుకు మెయిల్ తద్యమని తెలియడంతో అప్పటికప్పుడు మద్యమం టెండర్లు ఏదో జరిగిపోయింది అంటూ కేసు పెట్టారు. పైగా చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొనకూడదని ప్రెస్ మీట్ పెట్టకూడదంటూ హైకోర్టులో పిటిషన్ వేసి జగన్ రెడ్డి తన పిరికితనాన్ని బయట పెట్టుకున్నాడు. కేసులు పెట్టడం నిందలు వేయడం తప్ప నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు రూపాయి అవినీతి చేశాడని ఇంతవరకు కూడా నిరూపించలేక పోయారు. జీవోలు ఇచ్చిన అజయ్ కల్లాం రెడ్డిని జగన్ రెడ్డి ఇంతవరకు కనీసం విచారణ కూడా జరపలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ జగన్ రెడ్డి మద్యo కుంభకోణాన్ని ప్రజలకు వివరిస్తున్నందుకే తిరిగి మద్యమం కుంభకోణాన్ని తెలుగుదేశం నేతలపై పెట్టి అనచి వేసే కుట్ర చేస్తున్నారు. నాలుగున్నర ఏళ్ల పాలనలో తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఏ కేసులో కూడా ఆధారాలు బయట పెట్టకుండా కేవలం ఆరోపణాలతో కాలం నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందని భయంతో తాను దోచుకుంటున్న మద్యం కుంభకోణాన్ని చంద్రబాబు ఆపాదించే ప్రయత్నం చేశారు. అడ్డగోలుగా కేసులు తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించింది ఏమీ లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అణచి వేయడమే లక్ష్యంగా కొల్లు రవీంద్ర పై తప్పుడు కేసు పెట్టారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని ఎవరు అడ్డుకోలేరని విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నాం. నాలుగేళ్లలో కలిసి మద్యం అమ్మకాలతో రూ: 24 వేల కోట్లు దిగమిగిన జగన్ రెడ్డి
ని సిగ్గుగా టిడిపి ప్రభుత్వం పై చంద్రబాబుపై నిందలేస్తూ మద్యం దోపిడిని ప్రజలకు తెలియకుండా చేయాలనుకుంటున్నాడు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తయారీ సరఫరా డిస్టిలరీస్ పై జగన్ రెడ్డి సిబిఐ విచారణ కోరగలడా?
ఫ్రీవిలేజ్ ఫీజు తగ్గించారని ఆరోపణ పచ్చి అబద్ధం… ఫ్రీ విలేజ్ ఫీజు కి సంబంధించి మద్యం వ్యాపారుల్ని విజ్ఞప్తితో నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు
రూ: 1800 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పటికే మద్యం దుకాణాలు లైసెన్సు పొందిన వారు ఎవరైనా సరే ప్రభుత్వానికి
రూ: లక్ష కోచికత్తు సమర్పించి లేబుల్ రిజిస్ట్రేషన్ పొందే వెసులుబాటు కల్పించింది.
అదే తప్పు అయితే మరి నేడు వైసిపి ప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్లకు ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి… వాసు దేవ రెడ్డి సమాధానం చెప్పాలి. డిస్టిలరీల ఏర్పాటు వాటి అనుమతులకు సంబంధించి నాటి ప్రభుత్వం ఐ.ఏ.ఎస్ అధికారులు రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు చార్టెడ్ అకౌంట్స్ కమిటీ సూచనల ప్రకారమే వ్యవహరిస్తుంది. జగన్ ప్రభుత్వం చెప్పిన పి.ఎం.కె విశాఖ డిస్టీలరీల విషయంలో గత ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తే అవే డిస్టీల రీల ఇప్పటికీ ప్రభుత్వం పెద్దలు ఆధీనంలో ఎలా కొనసాగుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి మద్యంతర బెయిల్ వస్తుందని తెలిసే జగన్… తాను ఆడమన్నట్లు ఆడే వాసుదేవన్ రెడ్డి ద్వారా మద్యం కేసు పెట్టించారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం మాఫియా వెనక ఉన్న పాత్రధారితోనే తప్పుడు ఆరోపణలు చేయించి చంద్రబాబుపై కేసు పెట్టించారు.
జగన్ అధికారంలోకి రాగానే తన మద్యం దోపిడీకి పనికొస్తాడని ఏరి కోరి వాసుదేవరెడ్డిని తెలంగాణ నుండి ఏపీకి రప్పించి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా డిస్టిలరీస్ చైర్మన్గా నియమించాడు కల్తీ మద్యం అమ్ముతూ దాదాపు 40 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశాడు. 30 వేల మంది బలైపోయారు. జగన్ తన దోపిడి కోసం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం వల్ల ప్రభుత్వం ఖజానాకు ఎలాంటి ఆదాయం రాకపోయినా తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రం వేల కోట్లు చేరాయి. నాలుగేళ్లలో కల్తీ మద్యమం అమ్మకాలలో లక్షల కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి… మద్యం టెండర్లు చంద్రబాబు తప్పు చేశాననడం సిగ్గుచేటు గత ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన మద్యమం పాలసీలలో వినియోగదారుడికి తనకు ఇచ్చిన మద్యం కొనుక్కునే ఛాన్స్ ఉంది ఈ మద్యం కూడా తక్కువ ధరలకు లభించేది కానీ నేడు జగన్ రెడ్డి పాలనలో వచ్చిన బ్రాండ్ దొరకదు జగన్ అమ్మించే కల్తీ మద్యం తప్ప రాష్ట్రంలో మరే బ్రాండ్ల మధ్య దొరకడం లేదు.
అధికారుల్లోకి వస్తే మద్యాన్ని పూర్తిగా నిషాదిస్తాం ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తానని ఎన్నికల ముందు జగన్ రెడ్డి హామీ ఇచ్చాడు. మధ్య నిషేధం చేసి తరువాతనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని కూడా ప్రమాణం చేశావాడు. కానీ అధికారంలోకి రాగానే కల్తీ మద్యం బ్రాండ్లను పరిచయం చేసి దోపిడీకి తెర లేపాడు. రాష్ట్రంలోని డిస్టీల రీలన్నిటిని చేతుల్లో పెట్టుకొని కల్తీ మద్యమం తయారు చేస్తూ వాటిని తాగాలంటూ ప్రజల నెత్తిన రుద్దుతూ వేల కోట్లు వెనకేసుకున్నాడు. గతంలో ఎన్నడూ చూడని మద్యం బ్రాండ్లను రెట్టింపు రేట్లకు అమ్ముతూ ప్రజల జేబులు గుల్ల చేశారు. నాలుగేళ్ల దాదాపు 40 లక్షల మంది తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యాడు. 30 వేల మంది ప్రాణాలు తీసి మహిళల మాంగళ్యాలు. తెంచాడు. ఇలాంటి జగన్ రెడ్డి చంద్రబాబు ఏదో చేశారంటూ కేసులు పెట్టడం జగన్ రెడ్డి పైశాసి కత్వానికి నిదర్శనం నిదర్శనం.