కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
జాగింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ.. ఫ్లైఓవర్‌పై నుంచి పడి మృతి

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
జాగింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ.. ఫ్లైఓవర్‌పై నుంచి పడి మృతి
కర్నూలు ప్రతినిధి జూలై 14 యువతరం న్యూస్:
కర్నూలు నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బళ్లారి చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు అదుపుతప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి కిందపడిన వరప్రసాద్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం దర్యాప్తు చేపట్టారు.
హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి మృతితో ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.



