ప్రజల సంక్షేమము మరియు అభివృద్ధి కూటమి ప్రభుత్వం ధ్యేయం


ప్రజల సంక్షేమము మరియు అభివృద్ధి కూటమి ప్రభుత్వం ధ్యేయం
పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా
డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు
కర్నూలు ప్రతినిధి జూలై 14 యువతరం న్యూస్:
కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటుందని పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మురికి నీరు ట్రీట్మెంట్ ప్లాంట్ భూమి పూజ సందర్భంగా పేర్కొన్నారు. కర్నూలు నగరం లో నుండి వచ్చే మురికి నీటిని శుభ్రపరిచే ప్రక్రియ కొరకు 150 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పథకం క్రింద 35 ఎం ఎల్ డి ట్రీట్మెంట్ ప్లాంటును ఏర్పాటు చేయటానికి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని , ఈ ప్లాంట్ ను 18 నెలల లోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్త తెలియజేశారు. మంత్రి టీజీ భరత్ పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మరియు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తో కలిసి ట్రీట్మెంట్ ప్లాంట్ కు భూమి పూజ నిర్వహించి పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్త మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ కూడా మురికి నీరు నదులలో కలువ కూడదని , నదీ జలాలు కలుషితం కారాదని అందుకు కావలసిన కార్యాచరణ చేపడుతూ ఉండాలని తెలియజేశారు. కర్నూలు నగరం గత కృష్ణ పుష్కరాల సమయంలో ఈ మురికి నీరు నదిలో కలుస్తూ ఉండడం వల్ల పుష్కర యాత్రికులు సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు.ఈ మురికి నీరు నేరుగా తుంగభద్రా నదిలో కలవడం నదీ జలాలు కలుషితం కావడం నది క్రింది భాగంలో వారికి చాలా సమస్యలు వస్తాయని ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వలన ఆ సమస్య తీరుతుందని మంత్రి తెలిపారు. మురికి నీటిని శుభ్రపరచిన తర్వాత వచ్చే నీరు త్రాగటానికి మినహా మిగిలిన అన్ని పనులకు వాడుకోవచ్చని తెలిపారు. ఉదాహరణకు పరిశ్రమలకు, వ్యవసాయం కు మరి ఇతర పనులకు పనికి వస్తాయని , ఆ నీటిని అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండిటిని సమాంతరంగా పాటిస్తూ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధికి కృషి చేస్తూ ఉందని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటం జరుగుతూ ఉందని,రాష్ట్రంలో అన్ని రోడ్లు బాగు చేయడం , పరిశ్రమలు తీసుకుని రావడం వంటి అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తూ ఉందని తెలియజేశారు. కావున అన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ…రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి గణనీయంగా జరుగుతూ ఉందని తెలిపారు. ఈ డబల్ ఇంజిన్ సర్కార్ ద్వారా కేంద్రము , రాష్ట్రము నుండి అత్యధికంగా నిధులు రాబట్టి కర్నూలు అభివృద్ధి చేస్తూ ఉన్నామని తెలిపారు. కర్నూలు ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి మంత్రి టీజీ భరత్ అన్ని విధాలా కృషి చేస్తూ ఉన్నారని తెలిపారు.ఈ విధంగా బాధ్యతతో అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అన్ని విషయాలలో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు నగర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్న మంత్రి టీజీ భరత్ గుప్త మరియు పార్లమెంటు సభ్యులు నాగరాజును అభినందించారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ హజ్ కమిటీ డైరెక్టర్ సూరి మన్సూర్ అలీ ఖాన్ , కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబులేసు , మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రఘు, ఎస్ ఈ పబ్లిక్ హెల్త్ రామ్మోహన్ యాదవ్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్ మున్సిపల్ ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు.



