జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం

జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం
(యువతరం అక్టోబర్ 7) కొత్తపల్లి విలేకరి;
జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం అని జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని కొక్కెరంచ గ్రామంలో పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఓ మరుపురాని ఘట్టంగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దీని ద్వారా అందరికి గ్రామాల్లోనే ఉచిత ఆరోగ్య పరీక్షలతోపాటుగా ఉచిత వైద్యసేవలు కూడా ప్రభుత్వం వైద్య సిబ్బంది ద్వారా అందిస్తుందన్నారు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే గ్రామాల వద్దకే వైద్యసేవలను తెచ్చిన నాయకుడు అని అన్నారు .జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 598 మంది దాకా ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు చేయించుకున్నారని, 10 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని. 141 మందికి కంటిపరీక్షలు నిర్వహించామని, డాక్టర్ విజయేంద్ర వర్మ అన్నారు . కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సింగారం వెంకటరమణ ప్రోగ్రాం ఆఫీసర్ రఘురాం, ఎంపీడీవో మేరీ ,డిప్యూటీ తహసిల్దార్ పెద్దన్న,వైద్యులు జుబేదా బేగం ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగేశ్వరమ్మ, పంచాయతీ సెక్రెటరీ నాగరాజు,వీఆర్వో వేణుగోపాల్ ఆశ వర్కర్లు సచివాల సిబ్బంది వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.