చంద్రబాబుకు సంఘీభావంగా యాదవులు రిలే దీక్షలు
తెదేపా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు

చంద్రబాబుకు సంఘీభావంగా యాదవులు రిలే దీక్షలు
భారీగా తరలివచ్చిన యాదవ్ నాయకులు
అవినీతి లేని నాయకుడు చంద్రబాబు
రానున్నది చంద్రన్న రాజ్యమే
టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు
(యువతరం సెప్టెంబర్ 26) ఆదోని ప్రతినిధి:
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఆదోనిలో యాదవ సంఘం నాయకులు సంఘీభావం తెలుపుతూ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అధ్యక్షతన యాదవ్ సోదరులు దొడ్డనకేరి హనుమేష్ యాదవ్ , విరుపాపురం వీరేష్ ఉరుకుంద యాదవ్, ముని యాదవ్, మేకల వీరేశ్ యాదవ్, కొత్తూరు నరసింహులు, కలబావి గోవర్ధన్ యాదవ్ , చిన్న పెండేకల్ అర్జున,నాగరాజు తదితరులు దీక్షలో కూర్చోవడం జరిగింది. దీక్షలో కూర్చున్న వారికి ముందుగా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు యువ నాయకులు భూపాల్ చౌదరి , రంగ స్వామి నాయుడు ,మారుతి నాయుడు వెంకటేష్ చౌదరి బసాపురం రామస్వామి ,బుద్దరెడ్డి,తిమ్మప్ప , దొడ్డనకేరి సీనియర్ నాయకులు శివప్ప లు పూలమాలలు వేసి దీక్ష ను ప్రారంభించడం జరిగింది. రిలే నిరాహార దీక్షకు భారీ ఎత్తున యాదవ్ సంఘం నాయకులు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా నెట్టికల్ గ్రామానికి చెందిన బొందిలి సంఘం నాయకుడు రవీంద్ర సింగ్ రిలే నిరాహార దీక్ష చేపడుతున్న యాదవ సంఘం నాయకులకు తన సంఘీభావం తెలపడం జరిగింది. సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ అవినీతి లేని నాయకుడు ఈ దేశంలో ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు అని ఆయన తెలిపారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారని కానీ ఆయన జైల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలే కాదు దేశంలోనే ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న ఆయన అభిమానులు అంతా కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని దటీజ్ చంద్రబాబు అని ఆయన తెలిపారు. 2024లో రానున్నది మాత్రం చంద్రన్న రాజ్యమేనని ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కుతో చంద్రబాబుని మరల ముఖ్యమంత్రి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి ఆరెకల్ రామకృష్ణ ,కల్లు బావి వీరేష్ యాదవ్,మల్లికార్జున , నెట్టకల్ మహేష్ యాదవ్, దొడ్డనకేరి వీరేంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.