ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
రూ.3 లక్షల కరెన్సీ నోట్లతో గణనాథుడి అలంకరణ

రూ.3లక్షల కరెన్సీ నోట్లతో గణనాథుడి అలంకరణ
యువతరం సెప్టెంబర్ మంగళగిరి ప్రతినిధి:
గణపతి నవరాత్రులలో భాగంగా మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ పరిధి యర్రబాలెం చెరువు సెంటర్ లో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో లక్ష్మీగణపతిగా అలంకరించారు. గత 11రోజులుగా విశేష పూజలందుకున్న గణనాథునికి 12వ రోజు శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులు రూ.3లక్షల రూపాయలతో సుందరంగా అలంకరించారు.రూ. 50,100,200,500, రూపాయల డినామినేషన్‌తో కూడిన కరెన్సీ నోట్లతో స్వామి వారిని అలంకరించారు. గత 12రోజులుగా నిత్య పూజలు అందుకుంటున్న గణనాథుడిని 13వ రోజు శనివారం సాయంత్రం భారీ ఊరేగింపు అనంతరం నిమజ్జనానికి తరలించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.