ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీశైల పుణ్యక్షేత్రంలో వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక వ్రత పూజలు

శ్రీశైల పుణ్యక్షేత్రంలో వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక వ్రత పూజలు
(యువతరం సెప్టెంబర్ 18) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఉదయం 7 గంటలకు స్వామి వారి యాగశాల ప్రవేశం నందు, శ్రీ వరసిద్ధి వినాయక వ్రత పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సాక్షి గణపతి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన శ్రీ మృత్తిక గణపతికి విశేష పూజలు, ఉచిత సామూహిక సేవలలో భాగంగా, చంద్రావతి కళ్యాణ మండపంలో గణపతి పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.