చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష
(యువతరం సెప్టెంబర్ 18) అమడగురు విలేకరి
మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు మద్దతుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో మాజీ మంత్రి పల్లె నాయకులు కార్యకర్తలు కలిసి 101 కొబ్బరికాయలు కొట్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ మీద క్షేమంగా బయటికి రావాలని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగామాజీ,మంత్రి పల్లెరఘునాథరెడ్డి మాట్లాడుతూ,అభివృద్ధి చేయలేక ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని భయపడి కక్షతోఅక్రమకేసులు పెట్టి అరెస్టు చేయడం నీ పాలనకు దర్శనం అని నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు కూడా జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు మద్దతుగా బయటకు వచ్చి నిరాహార దీక్షలు చేసి మద్దతు తెలుపుతున్నారని తెలియజేశారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాల నుంచి చంద్రబాబు ని లోకేష్ ని ఏ కేసులో ఇరికిద్దామని అనేక కుట్రలు చేపడుతున్నారు మా నాయకుడు అని 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి మచ్చలేని చంద్రుడని అలాంటి ఆయనపై స్కిల్ డెవలప్మెంట్ లో అవకతవకలు జరిగాయని అక్రమ కేసులు మంచి పద్ధతి కాదని నీకు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుని నీకు బుద్ధి చెబుతారని మాజీమంత్రి పల్లె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి శ్యామ్ బాబు నాయుడు,శ్రీనివాస్ రెడ్డి కుమార్ రెడ్డి తెలుగు యువత రామాంజులు తెలుగు యువత మండల అధ్యక్షుడు,డికృష్ణారెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ నాగేందర్ రెడ్డి రామంజులనాయుడు,వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు కిష్ణప్ప రామచంద్ర తిరుపాలు అంగడి అమర శివారెడ్డి భాస్కర్ రెడ్డి. లక్ష్మీనారాయణ రవికుమార్ ఈ లక్ష్మీనారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.