జగన్నాధపురం వై జంక్షన్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు

జగన్నాధపురం వై జంక్షన్ లో ముమ్మరంగ వాహన తనిఖీలు
వెంకటాపురం సిఐ,వాజేడు ఎస్సై ఆధ్వర్యంలో కార్యక్రమం
(యువతరం సెప్టెంబర్ 18) వాజేడు విలేఖరి :
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జగన్నాధపురం వై జంక్షన్ లో వెంకటాపురం సిఐ బండారి కుమారు వాజేడు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి చత్తీస్గడ్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ఏజెన్సీ ప్రాంతమైన జగన్నాధపురం వై జంక్షన్ 163 జాతీయ రోడ్డు పై వాహనాలను ఆపి వాహనదారులను సమగ్రంగా విచారించి వాహన పత్రాలను పరిశీలించి పంపించారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ బండారి కుమార్ వాజేడు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు సివిల్ సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నారు
ములకలపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం
మండలంలోని ములకలపల్లి గ్రామంలో వెంకటాపురం సిఐ బండారి కుమార్ వాజేడు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు ములకలపల్లి గ్రామంలో సంయుక్తంగా నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా సిఐ బండారి కుమార్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా తమ తమ పనుల్లో చక్కగా నిమగ్నమై కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చేలా కష్టపడాలని ఎటువంటి చెడు అలవాట్లకు మద్యం పేకాటకు అలవాటువై కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా వాజేడు ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా సైబర్ క్రైమ్ ఫై అవగాహన తెచ్చుకొని సైబర్ మోసాలకు గురి కావద్దని ఈ సందర్భంగా అన్నారు.గ్రామంలోని యువత ప్రజలు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవారు ఫోన్ పే గూగుల్ ప్లేలాంటి బ్యాంకింగ్ సౌకర్యం ఉన్నవాళ్లు ఎవరో తెలియని వారు పెట్టే మెసేజ్లకు మోసపోయి ఏటీఎం పిన్ నెంబర్లు కానీ ఆధార్ కార్డు నెంబర్లు గాని సెండ్ చేయవద్దని హెచ్చరించారు,అలాంటి మెసేజ్లు గనుక వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని అనుకోని సమయంలో ఎవరైనా పిన్ నెంబర్లు మెసేజ్ చేసి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ కి నేరుగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ బండారి కుమారు వాజేడు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు సివిల్ సిఆర్పిఎఫ్ బలగాలు ములకలపల్లి గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు.