
గుడుంబా మహమారిపై ఉక్కు పాదం
అయ్యవారిపేట ధర్మవరంలో అడుగడుగునా తనిఖీలు
భారీగా పట్టుబడిన నాటుసార
(యువతరం సెప్టెంబర్ 18 ) వాజేడు విలేఖరి :
వాజేడు మండలంలోని పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మవరం అయ్యవారిపేట గ్రామాలలో విచ్చలవిడిగా నాటుసారా అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు పేరూరు ఎస్సై గొర్ల రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ స్టాప్ సిఆర్పిఎఫ్ బలగాలతో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేయగా అయ్యవారిపేట గ్రామంలో కుమ్మరి సూరిబాబు ఇంట్లో 16 లీటర్ల నాటు సారా కుమ్మరి వెంకట్ లక్ష్మి వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు ఇంట్లో 16 లీటర్ల సారా ముత్తునూరు సుందర్రావు ఇంట్లో 16 లీటర్ల నాటుసారా జనగం రమణ ఇంట్లో 20 లీటర్ల నాటుసారా పట్టుబడింది
ధర్మవరం గ్రామానికి చెందిన ముత్యబోయిన సరోజిని వైఫ్ ఆఫ్ రవి ఇంట్లో 12 లీటర్ల నాటు సారా గారా సారయ్య సన్నాఫ్ వెంకన్న ఇంట్లో 10 లీటర్ల నాటుసారా మొత్తం సుమారు 89 లీటర్ల ప్రభుత్వ నిషేధిత నాటుసారా చత్తీస్గడ్ రాష్ట్రం నుండి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుండగా పట్టుకొని వాజేడు ఎమ్మార్వో ముందర హాజరు పరచడం జరిగిందని ఒక ప్రకటనలో పేరూరు ఎస్సై గొర్ల రమేష్ తెలియజేశారు ప్రభుత్వం నిషేధించిన నాటుసారా ఎవరు అమ్మిన ఛత్తీస్గడ్ రాష్ట్రం నుండి తీసుకువచ్చిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్సై గొర్ల రమేష్ సివిల్ సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నారు.