ANDHRA PRADESHBREAKING NEWSFILMPOLITICSSTATE NEWSWORLD
నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు
తలైవా రజనీకాంత్

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు : రజినీకాంత్
చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్ష.
లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్
(యువతరం సెప్టెంబర్ 13) చెన్నై:
తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు,అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు.నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు.తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజాసేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.