ANDHRA PRADESHDEVOTIONALPOLITICSSTATE NEWS

టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యుల ఎంపికపై ఏపీ హైకోర్టులో వాదన

టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యుల ఎంపికపై కోర్టులో వాదన

(యువతరం సెప్టెంబర్ 13) విజయవాడ:

జడ శ్రావణ్ కుమార్ మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు  ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

టిటిడి ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయబాబు,దేశాయ్ నికేతన్,శరత్ చంద్రారెడ్డి నియామకం సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో  విజయవాడ కి చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.పిటిషనర్ తరుపు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.మంచి నడవడిక లేని,అనర్హులను,నేర చరిత్ర ఉన్నవారిని టిటిడి సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని ధర్మాసనం కి  జడ శ్రావణ్ కుమార్ విన్నవించారు.పిటిషన్ విచారించిన చీఫ్ జస్టిస్ మరియు జస్టిస్ రఘునందన రావు ధర్మాసనం.

ప్రభుత్వాన్ని వివరణ కోరిన ధర్మాసనం

శిక్ష ఇంకా విధించని కారణం గా వారు నేరస్థులుగా పరిగణించలేదన్న ప్రభుత్వం తరుపు న్యాయవాది.

ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఇండియా సభ్యత్వం నుండి తొలగింప బడిన కేథన్ దేశాయ్ ను టిటిడి సభ్యుడిగా నియమించారని  న్యాయవాది జడ శ్రావణ్ ధర్మాసనం దృష్టికి తీసుకొని రావడం జరిగింది.

లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని,ఎమ్మెల్యే ఉద్యాభానుపై క్రిమినల్ కేసులు నమోదు కాబడ్డాయని న్యాయవాది జడ శ్రావణ్ ధర్మాసనానికి వివరించారు.

కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేయడం జరిగింది.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!