విజయవంతంగా మెగా రక్తదాన శిబిరం

విజయవంతంగా మెగా రక్తదాన శిబిరం
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి:
పినపాక మండలం, దుగినేపల్లి గ్రామంలో శనివారం దుగినేపల్లి గ్రామ యూత్ ఆధ్వర్యంలో చేయూత స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహా రక్తదాన శిబిరాన్ని దుగినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మహా రక్తదాన శిబిరానికి స్థానిక సీఐ శివ ప్రసాద్, ఎస్సై నాగుల్ మీరా ఖాన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొని యువకుల నుండి సుమారు వందమందికి పైగా యువకులు రక్తదానం చేశారు . యువత రక్తదానానికి ముందుకు రావడం ఆనందకర విషయమని చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సాయి ప్రకాష్ అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 45 సార్లు రక్తదానం చేసిన బిల్లం ప్రసాదరావు, 25సార్లకు పైగా రక్తదానం చేసిన గద్దల సాయిబాబు కు యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.