వేసిన పంటలు నమోదు చేయించుకుంటేనే భీమా

వేసిన పంటలు నమోదు చేయించుకుంటేనే బీమా
ఉద్యాన అధికారి జి కళ్యాణి
(యువతరం న్యూస్ సెప్టెంబర్ 2) ప్యాపిలి విలేఖరి:
ప్యాపిలి మండలంలో చిన్న పూదిల్ల గ్రామంలో మామిడి పంటలో అంతర్ పంటల పంట నమోదు మరియు కొత్త బురుజు గ్రామం లోని డోన్ మండలం లో మిరప పంట నమోదు కార్యక్రమాన్ని ఉద్యాన అధికారి జి కళ్యాణి పరిశీలించారు.
వారు మాట్లాడుతూ:
ఖరీఫ్ సీజన్ లో పంటలు సాగు చేసిన రైతులందరూ పంటను నమోదు చేయించుకోవాలి అని సూచించారు. పంటలతో పాటు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ లను కూడా నమోదు చేయాలని తెలిపారు. ‘ పంట నమోదు చేయించుకుంటేనే పంట నష్టపరిహారం,పంటల బీమా,రాయితీ తో విత్తనాలు, పంట రుణాలు, ఇతర రాయితీలు వర్తిస్తాయని తెలిపారు. పంటల నమోదు కార్యక్రమంలో సమస్యల గురించి రైతు భరోసా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మిరప పంటను మల్చింగ్ షీట్ విధానంలో సాగు ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో
రైతు భరోసా సిబ్బంది మౌలాలి, రమేష్ మరియు రైతులు పాల్గొన్నారు.