ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైయస్సార్

ప్రజల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిన నేత వైఎస్సార్
( యువతరం సెప్టెంబర్ 2) మంత్రాలయం ప్రతినిధి:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయి గా నిలిచారని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్ వర్దంతి సందర్బంగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఎంపీపీ వై. గిరిజమ్మ, కాచాపురం సర్పంచ్ వై. జయమ్మ తో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వై. బాలనాగిరెడ్డి మాట్లాడుతూ పేదలకు అవసరమైన సంక్షేమ పథకాలతో పాటు అన్నదాతలకు సాగు నీటి ప్రాజెక్టులు మంజూరు చేసి, ప్రతి పేదవాడికి వైద్యం , విద్య అందించాలనే ఉద్దేశంతో 108,104 ఆరోగ్య శ్రీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లతో ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానియుడని కొనియాడారు. తన తండ్రి ఆశయాలను నేర వేర్చేందుకు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటు సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల మేనిఫేస్టోనే భగవద్గీత, కురాన్, బైబిల్ గా పరిగణించి ప్రతి హామీ అమలు చేస్తు దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాల క్యాలెండరు ను విడుదల చేసి మాట తప్పని మడమ తిప్పని నేత గా ప్రజల గుండెల్లో గుర్తింపు పొందడం జరుగుతుందన్నారు. ప్రతి పక్ష పార్టీలు ప్రభుత్వం పై ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రాలయంలో ఘనంగా వైయస్సార్ 14 వ వర్ధంతి
మంత్రాలయం మండల కేంద్రంలోని రాఘవేంద్ర సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమారెడ్డి , సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య , రచ్చమర్రి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, మాలపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు గురురాజరావు నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, వీరారెడ్డి, జిమ్మి తదితరులు ఉన్నారు.