ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు
( యువతరం సెప్టెంబర్ 2 )కొత్తపల్లి విలేఖరి :
దివంగత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని కొత్తపల్లిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి జడ్పిటిసి సభ్యులు సోముల సుధాకర్ రెడ్డి వైకాపా మండల కన్వీనర్ కే సుధాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిచారు.ఈ సందర్భంగా జడ్పిటిసి సభ్యులు సోమల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడన్నారు.ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన నాయకుడన్నారు.ఆయన ప్రజలకు భౌతికంగా దూరమై 14 ఏళ్లు పూర్తవుతున్నా జనం హృదయాల్లో కొలువై ఉన్నారన్నారు.ప్రజల కష్టాలను అర్థం చేసుకుని… నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మహా నాయకుడు అని ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగంపల్లి సొసైటీ చైర్మన్ గౌరు జనార్దన్ రెడ్డి, వైకాపా నాయకులు నాగ ఎల్లయ్య, రహంతుల్లా, నాగార్జున రెడ్డి శ్రీనివాసులు ,పాలెం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.