
ప్రజా సమస్యలు పరిష్కరించాలి:సిపిఎం
( యువతరం, సెప్టెంబర్ 2) కొత్తపల్లి విలేఖరి :
ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల నాయకులు ఎన్ స్వాములు,ఎస్ సంజీవరాయుడు అన్నారు. నిత్యవసర సరుకుల ధరలను అదుపు చేయాలని కరువు నిరుద్యోగ సమస్యలను కరెంటు సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం కొత్తపల్లి మండలంలోని పెద్ద గుమ్మడాపురం , శివపురం గ్రామపంచాయతీలలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయి విద్యుత్ చార్జీలను ఏడుసార్లు పెంచిన ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును రైతులకు గృహ అవసరాలకు ఇవ్వకపోవడం వల్ల కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అప్రకటిత విద్యుత్ కోతల వల్ల గ్రామాల్లో రాత్రుల్లో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు తాగునీటి కి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రభుత్వం నాణ్యమైన కరెంటును గృహ అవసరాలకు వ్యవసాయానికి ఇవ్వడంలో విఫలమైంది లక్షలాదిమంది ప్రతి సంవత్సరం డిగ్రీలు చేత పట్టుకొని బయటికి వస్తుంటే ఏందిరా రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఐదు శాతం మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి అని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలను అదుపు చేయాలని కరెంట్ ఛార్జీలు తగ్గించి వ్యవసాయానికి గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి ఏసన్న జ్ఞాన సూర్యుడు దేవకుమార్ ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్ బాబు యాదవ్ గ్రామరైతులుసుబ్బరాయుడు వెంకటేశ్వర్లు రమణ చిన్న చిన్నయ్య ధర్మరాజు స్వాములు తదితరులు పాల్గొన్నారు