పూజ్యాయ రాఘవేంద్రాయ మహారథోత్సవం

పూజ్యాయ రాఘవేంద్రాయ మహారథోత్సవం
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
( యువతరం సెప్టెంబర్ 2) మంత్రాలయం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 352 వ సప్త రాత్రోత్సవాల్లో అత్యంత ప్రముఖమైన ఉత్తరాధనలో భాగంగా శ్రీ రాఘవేంద్రుల మహా రథోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలి వచ్చారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవమూర్తి ప్రహల్లాద రాయలను గురు సార్వభౌమ సాంస్కృత పాఠశాల వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ హారతి ఇచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చేరుకున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రాంగణంలో మహా రథోత్సవం ప్రారంభించి, ఉత్సవమూర్తికి మంగళ హారతులు ఇచ్చి భక్తులు రంగులు వేసుకొని మంత్రాలయం పీఠాధిపతి స్వామీజీ ఆధ్వర్యంలో మహా ముఖ ద్వారం ముందు ఉంచిన మహారాతంపై ఆదిష్టించి హారతులు ఇచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి భక్తులను ఆశీర్వదించారు. హెలికాప్టర్ ద్వారా మఠం ప్రాంగణంలో పూలవర్షం కురిపించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి సర్కిల్ వరకు వెళ్లి అక్కడ నుండి శ్రీ మఠానికి చేరుకొని, శ్రీ రాఘవేంద్ర స్వామి రథోత్సవంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ,తెలంగాణ వేలాదిగా భక్తులు తరలి వచ్చారు .భక్తజనులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావన దర్శన భాగ్యాన్ని కనులారా తిలకిస్తూ దేవ దేవుని కృపను పొందుకున్నారు.