రమణీయం శ్రీ రాఘవుడి మహా రథోత్సవం

రమణీయం…..శ్రీ రాఘవుడి మహా రథోత్సవం
వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు వై. ప్రదీప్ రెడ్డి
( యువతరం సెప్టెంబర్ 2) మంత్రాలయం ప్రతినిధి:
శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 352 వ మహా రథోత్సవం రమణీయంగా సాగింది. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి కుటుంబ సతీసమేతంగా , వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జి. భీమారెడ్డి ,సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య తో కలిసి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహా రథోత్సవం వద్ద పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారి తో కలిసి వై. ప్రదీప్ రెడ్డిసాంప్రదాయం ప్రకారం నారికేళాలు సమర్పించి, గుమ్మడి కాయ కొట్టి రథోత్సవం ను ముందు లాగారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పెట్రోలు బంక్ శీనన్న, వైఎస్. ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, నాయకులు జనార్దన్ రెడ్డి, బొంబాయి శివ తదితరులు ఉన్నారు.