
పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దరఖాస్తు అందిస్తున్న పోలెబోయిన శ్రీవాణి .
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
హైదరాబాద్ గాంధీభవన్ లో పినపాక నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దరఖాస్తు అందించిన పోలెబోయిన శ్రీవాణి.
పోలెబోయిన శ్రీవాణి మాట్లాడుతూ… పినపాక నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో నేను పోటీలో ఉంటా ,కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పిసిసి,ఏఐసిసి ఆదేశానుసారం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమము చేసుకుంటూ,నియోజకవర్గంలో ప్రజల సమస్యల పట్ల, వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్థానని,కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు – నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్య పరిష్కరించుకుంటూ, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ,కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.అలాగే పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులతో కలసి బి. మహేష్ కుమార్ గౌడ్, కార్యనిర్వహక అధ్యక్షులు ఇంచార్జ్, ఆర్గనైజేషన్ ని కలవడం జరిగింది.