ANDHRA PRADESHDEVOTIONAL
మండలంలో మొదటి శ్రావణ శనివారం ప్రత్యేకంగా దేవాలయాలు అలంకరణ

మండలంలో మొదటి శ్రావణ,శనివారం ప్రత్యేకంగాదేవాలయాలు అలంకరించారు
(యువతరం ఆగస్టు 19 ) అమడగూరు,విలేకరి
ఆమడగూరు, మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా చౌడేశ్వరి దేవాలయం మరియు పలుదేవాలయాలు శనివారం శ్రావణమాసం సందర్భంగా జేకేపల్లి షిరిడి సాయిబాబా ఆంజనేయ స్వామి టెంపుల్ చౌడేశ్వరి దేవాలయాలను భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు పూజారులు ఆధ్వర్యంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరణ చేసి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామంలో భక్తులకు కనువిందుచేసే విధంగా ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాలకు భక్తులు ఉదయం నుంచే ఉపవాసంతో ముక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.