ప్రతి విద్యార్థి వ్యవసాయం గురించి తెలుసుకోవాలి

ప్రతి విద్యార్థి వ్యవసాయం గురించి తెలుసుకోవాలి
– మానవ జీవితంలో వ్యవసాయం ఓ భాగమే
(యువతరం ఆగస్ట్ 19) మద్దికేర విలేఖరి :
ప్రతి విద్యార్థి వ్యవసాయం గురించి తెలుసుకోవాలనీ, మానవుని జీవితంలో వ్యవసాయం ఓ భాగమే అని శ్రీ విద్యా సాయి విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీ యజ్ఞం వెంకట్ మాధవ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులకు వ్యవసాయం పై అవగాహన కల్పించారు.
శ్రీ విద్యా సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులచే వ్యవసాయం ఎలా చేయాలి, వ్యవసాయం విద్యలో ఒక భాగమని, విద్యార్థుల చేత మనం తినే అన్నాన్ని ఎలా పండించాలి అని దాని గురించి క్లుప్తంగా ప్రత్యక్షంగా చూపించడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థిని విద్యార్థుల చేత ఎలా పండించాలి రైతు పడుతున్న కష్టాన్ని కల్లారా చూపిస్తూ మన తల్లిదండ్రులు ఎలా అయితే మనమలను కష్టపడి చదివిస్తున్నారు అని పిల్లలకు క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు. శ్రీ విద్యా సాయి విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీ యజ్ఞం వెంకట్ మాధవ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటివి చూపించడం చాలా ముఖ్యమని విద్యార్థుల చేత వరమడి నాటించడం ఆ పంటను ఎలా పండిస్తారు, విద్యార్థులకు తెలియజేయడం చాలా ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే హెడ్మాస్టర్ శ్రీమతి బాల సునీత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ఈ ఫీల్డ్ ట్రిప్ లో పాల్గొన్నారు.