తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ను సన్మానించిన భద్రాద్రి జిల్లా కమిటీ

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్యను సన్మానించిన భద్రాద్రి జిల్లా కమిటీ
(యువతరం ఆగస్టు 19) భద్రాద్రి ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం : సుమారు 6 నెలల పాటు అమెరికా న్యూజిలాండ్ విదేశాల పర్యటనకు వెళ్లి ఇటీవల హైదరాబాద్ వచ్చిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ను టిడబ్ల్యూజేఎఫ్ భద్రాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. హైదరాబాదులోని చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నీ ఫంక్షన్ హాల్ లో ఆయనకు శాలువ కప్పి పూలదండలతో సన్మానించారు. సన్మానించిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు రవికుమార్ జిల్లా ఉపాధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి తదితరులు ఉన్నారు.