విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అందరిని ఆకట్టుకుంటున్న ఫోటో ప్రదర్శన

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అందరినీ ఆకట్టుకుంటున్న ఫోటో ప్రదర్శన
( యువతరం ఆగస్టు 19) విశాఖ ప్రతినిధి:
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం లోని ఉక్కు హౌస్ లో ఈ రోజు, రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం మరియు వాల్తేరు ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఉక్కునగరం లోని ఉక్కు హౌస్ లో ఫోటో ప్రదర్శనను ఆర్ ఐ ఎన్ ఎల్ సి ఎం డి శ్రీ అతుల్ భట్ ప్రారంభించారు. ఫోటో ప్రదర్శనలో ప్రదర్శించిన చిత్రాలను ఆయన ఎంతో ఉత్సాహంతో తిలకించారు.
ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రారంభ దశలో, నిర్మాణ దశ నాటి చిత్రాలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. చిత్రాలు చరిత్రను చిరకాలం భద్ర పరుస్తాయని వచ్చే తరాలకు చరిత్రను అందిస్తాయని శ్రీ అతుల్ భట్ తెలిపారు. చక్కటి ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం మరియు వాల్తేరు ఫోటోగ్రాఫిక్ సొసైటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ప్రదర్శనలో 1940వ సంవత్సరం నుండి 2023వ సంవత్సరం వరకు వాడుకలో ఉన్న వివిధ పురాతన కెమారాలను ఈ ప్రదర్శించారు. ఈ కార్యక్రములో డా.పిల్ల రాజారావు (వాసు) పేరున జీవిత సాఫల్య పురస్కారం సినీయర్ ఫోటోజర్నలిస్టు సి.వి. సుబ్రమణ్యం కు బండి వెంకట రమణ పేరున జీవిత సాఫల్య పురస్కారం సినీయర్ ఫోటోగ్రాఫర్ ఎన్.వి.వి.ఎస్.ప్రసాద్ కు స్పెషల్ అవార్డు సీనియర్ ఫోటోగ్రాఫర్ స్టీల్ ప్లాంట్ జి. సూర్యనారాయణ కు ఇవ్వటం జరిగింది .
ఈ సందర్భంగా వాల్తేరు ఫోటోగ్రాఫిక్ సొసైటీ సభ్యులు శ్రీ అతుల్ భట్ ని ఘనంగా సన్మానించారు.
జూలై నెల 21, 22, 23 తేదిలో మూడురోజులు అరకులో నిర్వహించిన ఫోటో వర్కషాపులో పాల్గన్న వారి ఫోటోలు ఎంపికచేసి ప్రొత్సాహక బహుమతులు ఇస్తారు. ఈ ప్రదర్శనలో అంతర్ జాతీయ గుర్తింపు పొందిన 30 మంది ఫోటో గ్రాఫర్లతో పాటు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఫోటోగ్రాఫర్స్ , ప్రముఖ ఫోటోగ్రాఫర్లు తీసిన ఆర్ట్ ఫోటోలు (ల్యాండస్కేప్, వేచూర్, వైడ్లైఫ్, పోట్రెట్) తిలకించవచ్చు. రేపు సాయంత్రం(ఆదివారం ) 4 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమంలో, విశాఖ ఉక్కు కర్మాగారం డైరెక్టర్ కమర్షియల్ డి కె మొహంతి ముఖ్య అతిధిగా పాల్గొంటారు.
డి ఏ వి పబ్లిక్ స్కూలు విద్యార్థులు, ఉక్కునగర వాసులు అనేక మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో విశాఖ ఉక్కు చీఫ్ జనరల్ మేనేజర్ జి గాంధీ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ ఇంచార్జి ఆర్ పి శర్మ , వాల్తేరు ఫోటోగ్రాఫిక్ సొసైటీ అద్యక్షులు, , పి.ఎన్.పేత్, గౌరవ అధ్యక్షులు వి. వేంకటేశ్వర రావు, సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఉపాద్యక్షులు జగపతి రాజు, కోశాధికారి వి.వి. రామరాజు, సహాయకార్యదర్శి రమేష్ చంద్రబోస్, సభ్యులు ఐ. సన్యాసి రావు, బి.హెచ్. శ్రీనివాస, డి.వి.రమణ, బి.ఎన్.ఎస్.ఎస్. ప్రసాద్, కె.ధర్మరాజు, పి.సుర్యనారాయణ, ఎం. బ్రహ్మజీ, జి.ఎన్.మూర్తి, ఎం. కనకరాజు, వి డెంటల్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ రమేష్ తదితరులు ఫాల్గొన్నారు.
ఆదివారం కూడా ఉండే ఈ ఫోటో ప్రదర్శనను అందరూ తిలకించవలసిందిగా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అధికారులు, వాల్తేరు ఫోటోగ్రాఫిక్ సొసైటీ సభ్యులు కోరారు.