వ్యాపార రంగానికి విశాఖ అనుకూలం

వ్యాపార రంగానికి విశాఖ అనుకూలం
నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి
( యువతరం ఆగస్టు 19) విశాఖ ప్రతినిధి:
వ్యాపార రంగానికి విశాఖ అనుకూలమైనదని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు.
శనివారం ఆమె విశాఖ న్యూ కాలనీ పరిధిలోని శ్రీ కన్య థియేటర్ వద్ద విఎస్ఆర్ ఆటో ఇ – మోటార్స్ నూతన షో రూమును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాపార రంగానికి విశాఖ నగరం ఎంతో అనుకూలమైనదని, ఎంతోమంది వ్యాపారులు విశాఖలో పెట్టుబడులు పెట్టి వారికి లాభాలతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ నగరం అభివృద్ధి చెందేందుకు ఎన్నో ప్రణాళికలు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ నగరం పరిపాలన రాజధానిగా అవతరించబోతుందని తెలిపారు. ఆటో ఇ – మోటార్స్ ద్వారా పర్యావరణపరంగా ఎటువంటి హాని ఉండదని ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇ- ఆటోలనే ఉపయోగిస్తున్నారని, ఇటువంటి షో రూమ్ లో ప్రతి నియోజకవర్గ పరిధిలోను ఏర్పాటు చేయాలని అలాగే విఎస్ఆర్ ఆటో ఇ మోటార్స్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు సిహెచ్ వి రామిరెడ్డి వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.