సమాజంలో సఫాయి కార్మికులు గౌరవంగా జీవించాలి

సమాజంలో సఫాయి కార్మికులు గౌరవంగా
జీవించాలి.
జాతీయ కమిషన్ సఫాయి
కర్మ చారి సభ్యులు డాక్టర్ పీపీ వావా.
( యువతరం ఆగస్టు 19) విశాఖ ప్రతినిధి:
ఎంఎస్ యాక్ట్ 2013 అమలు చేయాలని, సఫాయి కర్మచారుల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను అధ్యయనం చేసి వారు సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం కల్పించాలని కమిషన్ గౌరవ సభ్యులు స్టేట్ -సెక్రటరీ డాక్టర్ పీపీ వావా అన్నారు. కమిషన్ గౌరవ సభ్యులు శనివారం విశాఖలో పర్యటించారు. అనంతరం జీవీఎంసీ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మాన్యువల్ స్కావెంజింగ్ ను అంతం చేయగలదని తెలిపారు. అంతే కాకుండా మురుగునీటి కార్మికుల ప్రాణాలను కాపాడుతుందన్నారు.
ఎంఎస్ యాక్ట్ 2013 లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో కమిషన్ గట్టి ప్రయత్నం చేస్తోందని తెలిపారు. రాష్ట్రాలు, మున్సిపాలిటీలు, ఓడరేవుల అధికారులు, వివిధ సంఘాలు, జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
పునరావాస చట్టం 2013 డిసెంబర్ 6 నుంచి అమల్లోకి తేవడంతో మనుషులంతా ఒక్కటే అనే భావన పెరిగిందని, మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం మరియు ప్రత్యామ్నాయాన్ని కూడా చట్టం అందిస్తుందని అన్నారు. నిర్ణీత గడువులోగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా వారికీ విద్య వైద్య ఆరోగ్య రంగాలలో సహకారం అందించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు పునరావాసం కల్పించడమే కాకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ప్రత్యామ్నాయ వృత్తుల్లో మాన్యువల్ స్కావెంజర్స్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇప్పటికి ఇంకా మురుగు కాలువలను మాన్యువల్ గా శుభ్రపరచడంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం మరియు భద్రత, ఈ ఎస్ ఐ , పి ఎఫ్ లాంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన మురుగు కాలువల మరియు సెప్టిక్ ట్యాంకులను మాన్యువల్ క్లీనింగ్ ను నిలిపివేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు దానికి సంబంధించిన విషయాలపై అవగాహనా కల్పించాలని సూచించారు. ఈ విధంగా చర్యలు చేపడుతున్న జిల్లా యంత్రాగాన్ని అయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లికార్జున, జీవీఎంసీ కమీషనర్ సాయి కాంత్ వర్మ, డిసిపి విద్యాసాగర్ నాయుడు మరియు జిల్లా అధికారులు, కార్మిక సంఘాలు, పారిశుద్ధ్య కార్మికులు. పాల్గొన్నారు.