నీతి, నిజాయితీకి మారుపేరు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి

నీతి నిజాయితీకి మారుపేరు
కోట్ల విజయభాస్కర రెడ్డి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
యం సుధాకర్ బాబు
(యువతరం ఆగస్టు 16) కర్నూలు ప్రతినిధి:
నీతి నిజాయితీకి మారుపేరు స్వర్గీయ కోట్ల విజయభాస్కర రెడ్డి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యం సుధాకర్ బాబు ఆయన సేవలను కొనియాడారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి 103 వ జయంతి వేడుకలను బుధవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయంలో కోట్ల విజయ భాస్కర రెడ్డి చిత్ర పటమునకు మరియు కోట్ల సర్కిల్ నందలి కోట్ల కాంస్య విగ్రహమునకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రగతి పథంలో ఎన్నో మైలురాళ్లు సాధించి, పల్లె పల్లెకు తాగునీరు- సాగునీరు అందించడమే కాకుండా రోడ్లు, గృహాలు, విద్య, వైద్య, ఆరోగ్యం ప్రాధాన్యత ఇచ్చి రైతులకు భూమి హక్కు పత్రములను ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో కోట్ల విజయభాస్కరరెడ్డి మొదటి వ్యక్తి అని తెలిపారు. పేదలకు రూ.1.90 పైసలకే కిలో బియ్యం పథకం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టిన ఘనత కోట్లకే దక్కుతుందన్నారు. రైతులకు రూ.50/- లకే విద్యుత్ అందించడమే కాకుండా, బడుగు, బలహీన వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టి, మహిళల ఆత్మ గౌరవం కోసం ఏకంగా మద్యపానాన్ని నిషేధించి, డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు, కె.సి. కెనాల్, ఎల్.ఎల్.సి. ఆధునీకరణ పనులకు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఐదు సార్లు శాసన సభ్యులుగా, ఒక సారి శాసనమండలి సభ్యులుగా, ఆరు సార్లు కర్నూలు లోకసభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా, నాలుగు సార్లు కేంద్రమంత్రిగా సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కిందని సుధాకర్ బాబు గారు ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్, డిసిసి ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ గుప్త, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు బి బతకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్ సిహెచ్ బజారన్న, కోడుమూరు ఇంచార్జ్ దామోదరం రాధాకృష్ణ, మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, ఎస్సీ సెల్ సిటీ అధ్యక్షులు డబ్ల్యూ సత్యరాజు, డాక్టర్ సెల్ అధ్యక్షులు అమరేంద్ర రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు యన్ చంద్రశేఖర్, కార్యదర్శులు ఎజాస్, లాజరస్ కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి వెంకటన్న, సాంబశివుడు, బి సుబ్రహ్మణ్యం, రియాజ్, శివానంద్, నాగశేషు, కేశవరెడ్డి ఐ ఎన్ టి యు సి నాయకులు బిటి స్వామి, ఆనందం మహిళా కాంగ్రెస్ ఓబిసి సిటి కోఆర్డినేటర్ సాయి భార్గవి సేవాదళ్ మాధవి మైత్రి మొదలగు వారు పాల్గొన్నారు.
.