డోన్ లో సమయపాలన పాటించని వైద్యులు

సమయపాలన పాటించని వైద్యులు
ఇబ్బందులు పడుతున్న రోగులు
( యువతరం ) డోన్ ప్రతినిధి;
డోన్ ప్రభుత్వాసుపత్రిలో
పిల్లవాడికి చెవి నొప్పి ఉండడంతో డోన్ ప్రభుత్వ హాస్పిటల్ కి బుధవారం తీసుకొచ్చిన తండ్రి, ఆస్పత్రిలో ఎంతసేపటికి వైద్యులు రాకపోవడంతో ఆసుపత్రి బయట నిలబడి బాధను వెళ్లకక్కడం జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 1:00 లోపు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులందరూ వెళ్లిపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా గతంలో దాదాపు 8 సిజరింగులు ఒక రోజులో చేసేవారు. ఇప్పుడు కేవలం ఒకటి లేదా రెండు చేయడానికి ఇబ్బంది పడుతున్న వైద్యులు ఏమిటి అని అడుగుతే కర్నూల్ కి రేఫర్ చేస్తున్నారు. పూట గడవని పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కర్నూల్ పంపడం ఏంటని అంటున్నారు. కర్నూలుకు పోతే ఖర్చులు ఎక్కువ అయితాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి నుంచి ఇలాగే జరుగుతుంది.
ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ఇకనైనా పై అధికారులు కలగజేసుకొని పని వేళ లకు వైద్యులు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.