జగనన్నతోనే పేదల అభివృద్ధి

జగనన్నతోనే పేదల అభ్యున్నతి
సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం
గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో
ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ
(యువతరం ఆగస్టు 2) తుగ్గలి విలేఖరి;
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే పేదల అభ్యున్నతి సాధ్యమని, అలాగే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ అన్నారు. బుధవారం తుగ్గలి లో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సావిత్రమ్మ , సహకార సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, స్థానిక వైసిపి నాయకులు మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎంపిటిసి రాజు లు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ కు డ్రమ్స్ వాయిద్యాల మధ్య బాణాసంచాలు పేల్చుతూ గజమాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మా స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలను ప్రజలకు అందాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని అందాయని ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు గ్రామస్తులు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ప్రజలతో మాట్లాడుతూ గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేస్తానని, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి వాటిని అమలు చేయలేదన్నారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలు చేయడం జరిగిందని ఆమె ప్రజలకు వివరించారు. అందువల్ల మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు నాయక్, వీఆర్వో రహిమాన్, మైనార్టీ వక్ బోర్డ్ డైరెక్టర్ టిఎండి హుసేని, సహకార సంఘం అధ్యక్షులు అట్లా గోపాల్ రెడ్డి,కోఆప్షన్ సభ్యులు చాంద్ బాషా, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ సోమశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ జిట్టా నగేష్ యాదవ్, సచివాలయ మండల కన్వీనర్ హనుమంతు, వైయస్సార్ సిపి నాయకులు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, రాతన మోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, లలితా రామచంద్ర, మమల్లకుంట హనుమంత్ రెడ్డి, సత్తప్ప ,గిరి గిరిగేట్ల విష్ణువర్ధన్ రెడ్డి, అమీనాబాద్ సోమశేఖర్, ఎంబాయి రామాంజనేయులు ,జొన్నగిరి రఘు, రామకొండ సుధాకర్ రెడ్డి, మారెళ్ళ సుధాకర్ రెడ్డి, శభాష్పురం రాఘవరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, లింగన్న, వడ్డే వెంకటరాముడు, రాంపురం ఓబులేసు, గంగాధర్, గోవిందరాజులు, బద్రి ,హుస్సేన్ భాష, జొన్నగిరి దివాకర్ మన కింది సుదర్శన్ చెన్నంపల్లి సుభాన్, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.