ANDHRA PRADESHPOLITICSPROBLEMS
మహా పాదయాత్రలో దేవనకొండ సిపిఎం మండల నాయకులు

మహా పాదయాత్రలో దేవనకొండ సిపిఎం మండల నాయకులు
(యువతరం ) దేవనకొండ విలేఖరి;
జిల్లాలోని సాగు నీటి సాధన కోసం జిల్లా సమగ్రాభివృద్ధి కోరకు సిపిఎం పార్టీ చేపట్టిన మహా పాదయాత్రలో భాగంగా బుధవారం ఆదోని నుండి ప్రారంభమైన మహా పాదయాత్రలో దేవనకొండ మండల కమిటీ నాయకత్వం మరియు పార్టీసభ్యులు, ప్రజాసంఘాల నాయకులు 41 మంది పాల్గొన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం నిరసిస్తూ అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వ ఒత్తిడి తీసు కోచ్చే లక్ష్యంతో జరుగుతున్న ఈ పాదయాత్రలో సిపిఎం జిల్లా నాయకులు బి. వీరశేఖర్, మండల నాయకులు అశోక్, సూరి, మహబూబ్ బాషా, శ్రీనివాసులు, ఓంకార్, రాఘవరెడ్డి,బజారి,శ్రీరాములు, నాగరాజు, బలరాముడు,రాముడు, తిక్కయ్య, మహేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.