రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లింగమయ్య ఎన్నిక పట్ల హర్షం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లింగమయ్య ఎన్నిక పట్ల హర్షం
పెద్దవడుగూరు యువతరం విలేఖరి;
ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సి.లింగమయ్య ఎన్నిక పట్ల పెద్దవడుగూరు రజక సంఘ నాయకులు పెద్దక్క,రంగమ్మ,సరస్వతి,ఈరమ్మ,మల్లికార్జున కుల్లాయి రామాంజనేయులు,సుంకన్న, పాపన్న,నాగేంద్ర,శంకర, రంగనాయకులు,పుల్లయ్య,సుంకప్ప,సూర్యనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సుల్లో రాష్ట్ర కమిటీని ఎన్నిక చేయడం పట్ల వారు మాట్లాడుతూ రజకుల కోసం నిరంతరం పోరాడుతూ వారికి సేవ కోసం పోరాడే వ్యక్తికి ఇవ్వడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. రజకులకు ఏ సమస్య వచ్చిన ముందున్న వ్యక్తిని రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడుగా ఆయన సేవలు గుర్తించడం ఎంతో సంతోషదగ్గ విషయం అన్నారు. లింగమయ్యకు దేవుడు మరింత మందికి రజకుల కోసం సేవ చేయడానికి మరింత శక్తి ఇచ్చి జాతీయ స్థాయిలో పేరు రావాలని వారు దేవుని వేడుకున్నారు. రాజకీయంగా అవకాశం ఇస్తే పేదలకు సేవ చేసే అవకాశం ఉందన్నారు.అందుగ్గాను పలువురు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.