ANDHRA PRADESHPOLITICS
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మంత్రాలయం యువతరం ప్రతినిధి;
మంత్రాలయం నియోజకవర్గ హ్యట్రిక్ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మంత్రాలయం లో వైస్సార్సీపీ నేతలు జి. భీమారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్ లో రాఘవేంద్ర స్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నమస్కరించడం జరిగింది. అనంతరం చిన్నారులు, నాయకులు, కార్యకర్తల మధ్య బాణ సంచా పేల్చుతూ, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటారు.