వాజేడు మండలంలో చెరుకూరి సతీష్ సుడిగాలి పర్యటన

వాజేడు మండలంలో చెరుకూరి సతీష్ సుడిగాలి పర్యటన
వరద ముంపు ప్రాంతాల పరిశీలన మండలం లో క్యాడర్ పెంపుపై దృష్టి
వాజేడు యువతరం విలేఖరి;
వాజేడు మండలంలో వెంకటాపురం ఎంపీపీ, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సతీష్ గోదావరి వరద ముంపు ప్రాంతాలలో శనివారం పర్యటించారు. టేకులగూడెం వద్ద 163 జాతీయ రోడ్డు పై నీరు చేరి రాకపోకలకు ఆటంకం కలగడంపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. టేకులగూడెం పంచాయతీ సెక్రెటరీ నీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సందర్భంలో మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్ నాయుడుని మండలంలోని పరిస్థితులు అడిగి తెలుసుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బాలింతలు, గర్భవతులు దీర్ఘకాలిక జబ్బులతో ఉన్నవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా హాస్పటల్ కి అనుకున్న సమయానికి చేరేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్నారు. ఎంపీపీ వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.