OFFICIALPOLITICSSTATE NEWSTELANGANA
ఎమ్మెల్యే సీతక్కని సన్మానించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివారెడ్డి

ఎమ్మెల్యే సీతక్కని సన్మానించిన
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి
ములుగు యువతరం ప్రతినిధి;
శనివారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి తాన సభల్లో పాల్గొని ములుగు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే సీతక్కని కలిసి పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం సీతక్కతో భేటీ అయి వ్యవసాయ రంగానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్టు సాంబశివరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సి సి ఎక్స్ సిబ్బంది కార్తీక్ సాంబశివరావు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.